న్యూ ఢిల్లీ మే 4 (ఈతరం భారతం న్యూ స్);: ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా చేశారు. రాజీనామాను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. రాపోలు ఆనంద భాస్కర్‌తో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ్లు బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఈ సందర్భంగా రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ.. విధిలేని పరిస్థితిలో కీలక నిర్ణయం తీసుకున్నానన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితిలో తన లాంటి నేతలు ఉన్నారన్నారు. 2022లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్లో చేరానన్నారు
.















