EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మాదిగ‌ల‌, బీసీల‌ ఆత్మగౌరవాన్ని పరీక్షిస్తున్న రేవంత్ స‌ర్కార్  రాహుల్ చెబుతున్న సామాజిక న్యాయం రాష్ట్రంలో అమ‌ల‌వడం లేదు   రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుపై కాంగ్రెస్‌ది అస‌త్య ప్ర‌చారం.. ఓ వ‌ర్గానికే పెద్ద‌పీట..    బీసి రాజ్యాధికార సమితి రాష్ట్ర అద్యక్షులు దాసు సురేశ్‌

హైద‌రాబాద్‌, మే 4 (ఈతరం భారతం న్యూస్);పార్లమెంట్ ఎన్నిక‌ల సీట్ల కేటాయింపులో మాదిగ‌ల‌తో పాటు బీసీల‌కు కాంగ్రెస్ అన్యాయం చేస్తూ సామాజిక న్యాయాన్ని విస్మ‌రిస్తోంద‌ని బీసీ రాజ్యాధికార స‌మితి అధ్య‌క్షులు దాసు సురేష్ మండిప‌డ్డారు. ఎస్సీల‌కు కేటాయించాల్సిన మూడు సీట్ల‌లో మాదిగ‌ల‌కు ఎక్కడా అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని, అలాగే 55 శాతానికి పైగా ఉన్న బీసీల‌కు కేవ‌లం మూడుసీట్లనే కాంగ్రెస్‌ కేటాయించ‌డం బీసీల ఆత్మగౌరవాన్ని పరీక్షించడమేనన్నారు..హైద‌రాబాద్ లోని ఇందిరాపార్క్ వ‌ద్ద ఎంఆర్‌పీఎస్ నిర్వ‌హించిన ధ‌ర్నాలో దాసు సురేష్ పాల్గొని మంద‌కృష్ణ మాదిగ‌కు సంఘీభావం తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల‌ను బీజేపీ ఎత్తేస్తుంద‌ని అస‌త్య ప్ర‌చారాన్ని కాంగ్రెస్ చేస్తోంద‌ని, అస‌లు రిజ‌ర్వేష‌న్లును ఎత్తేసే ఉద్దేశ్య‌మే ఉంటే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ…. మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు, ఈబీసీ రిజ‌ర్వేష‌న్లు ఎందుకు తెస్తార‌ని ప్ర‌శ్నించారు. నిజానికి కాంగ్రెస్ అధిష్టానం చెబుతున్న సామాజిక న్యాయానికి, రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సామాజిక న్యాయానికి పొంతన లేకుండా ఉందని దాసు సురేష్ ఆవేదన వ్యక్తం చేసారు. 5 శాతం కూడా లేని రెడ్ల‌కు 7 పార్లమెంటు సీట్లు కేటాయించ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. అపుడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ, ఇపుడు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ బీసీలకు సామాజిక న్యాయం ఉల్లంఘ‌న జ‌రిగింద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలు లేరన్న చందంగా పక్క పార్టీ నుండి ఎంపీ అభ్యర్థులను అరువు తెచ్చుకుని సొంత పార్టీ నేత‌ల‌కు కూడా అన్యాయం చేసింద‌ని మండిప‌డ్డారు. ఆఖ‌రుకు కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌ల నియామ‌కంలోనూ బీసీల‌కు అన్యాయ‌మే జ‌రిగింద‌న్నారు. కేసీఆర్ పై వ్య‌తిరేక‌త‌తో కాంగ్రెస్ ను గెలిపించిన మాదిగ‌లు, బీసీలపై రేవంత్ ప్ర‌భుత్వం చిన్న‌చూపు చూస్తోంద‌న్నారు. రేవంత్ ప్ర‌భుత్వం తీరు ఇలాగే ఉంటే రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు పరాభవం త‌ప్ప‌ద‌ని దాసు సురేష్‌ హెచ్చ‌రించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట్ల వెంకటేష్ నేత అనేక మంది సామాజిక కార్యకర్తలు, ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

 

Related News

Select the Topic
Scroll to Top