EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కుల వృత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తా! మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి భారత సుదర్శన్

హైదరాబాద్ మే 5 (ఈతరం భారతం న్యూ స్):సమాజంలో కుల వృత్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తే సమాజం ఎంతో అభివృద్ధిని సాధిస్తుందని మల్కాజిగిరి పార్లమెంట్ స్వతంత్ర ఎంపి అభ్యర్థి భారత సుదర్శన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈస్ట్ బాలాజీహిల్స్, సాయిరాం నగర్ కాలనీల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి అభ్యర్థి భారత సుదర్శన్ మాట్లాడుతూ.. కుల వృత్తుల ప్రోత్సాహంతో నిరుద్యోగాన్ని తగ్గించవచ్చన్నారు. కుల వృత్తులు చేస్తున్న సామాన్యులకు దక్కాల్సిన గౌరవం మన సమాజంలో దక్కకపోవడం బాధాకరమన్నారు. సామాన్యులు చట్టసభలకు ఎన్నికైనప్పుడే పేద,మధ్య తరగతి, బడుగు, బలహీనవర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు.ఈ సందర్భంగా నాయకుల బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు అంకెపల్లి పరశురామ్ ను కలిసి సుదర్శన్ మద్ధతు కోరారు. తనను గెలిపిస్తే నాయీ బ్రాహ్మణులకు ఆధునిక వసతులతో కమ్యూనిటీ హాల్ ను నిర్మిస్తున్నానన్నారు. మల్కాజిగిరి ఎంపి ఎన్నికల్లో ‘గాజులు’ గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని భారత సుదర్శన్ ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో ఇప్పకాయల ప్రకాష్ నేత, వెంకటయ్య, ప్రజా సంఘాల నేతలు పుల్లూరి శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top