న్యూ ఢిల్లీ మే 7 (ఈతరం భారతం న్యూ స్);.: దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ మంగళవారం మరోసారి ఈ కేసు విచారణ జరిగింది. కవిత జ్యుడీషియల్ కస్టడీపై లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో దర్యాప్తు సంస్థలు హాజరుపరిచాయి.ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. కవితను కోర్టు ముందు అధికారులు హాజరు పరిచారు. ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో కవితకు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడగించింది. వారం రోజుల్లో కవితపై చార్జ్ షీట్‌ను దాఖలు చేస్తామని కోర్టుకు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టుకు ఈడీ, సీబీఐ అధికారులు కోరారు. లిక్కర్ పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని సీబీఐ, ఈడీ అధికారులు కోరారు. జైలులో కవితకు 10 పుస్తకాలు అనుమతించాలని కోర్టును కవిత న్యాయవాది నితీష్ రానా కోరారు. కోర్టులో కవితను 15 నిముషాల పాటు కలిసిసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోర్టును కవిత న్యాయవాది కోరారు.కోర్టు లాకప్‌లో కవితకు తన భర్త తెచ్చిన ఆహారం తినేందుకు అనుమతించాలని కోర్టును నితీష్ రానా కోరారు.జైలులో కవితకు ఇచ్చే ఇంటి భోజనం 10-15 మంది పోలీసులు చెక్ చేసిన తర్వాత పాడు చేసిన ఆహారాన్ని అందిస్తున్నారని.. అలా కాకుండా డాక్టర్ జైలు అధికారి చెక్ చేసి కవితకు అందించాలని కోర్టును కవిత న్యాయవాది కోరారు. కవిత ఇంటి భోజనం వద్దన్న తర్వాత మళ్లీ ఎందుకు అడుగుతున్నారని జడ్జి ప్రశ్నించారు. కవితకు ఇంటి భోజనం అందించే అంశంపై జైలు సూపరింటెండెంట్‌ను వివరణ కోరతామని జడ్జి అన్నారు.















