EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అభ్యర్థుల కన్నా పార్టీల ప్రభావమే మిన్న      రాజకీయ పార్టీల దిగ్గజాలతోనే అభ్యర్థుల భవితవ్యం ఎవరికి వారే గెలుపు అంచనాలు.. గెలుపు విశ్వాసాలతో అభ్యర్థులు భువనగిరి లోక్ సభ నియోజకవర్గం ముఖ చిత్రం

 

 

ఈతరం భారతం న్యూస్ హైదరాబాదు ప్రతినిధి

భువనగిరి లోక్ సభ స్థానం ఏర్పడిన తర్వాత 2009లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి 2014లో అప్పటి టీఆర్ఎస్ బూర నర్సయ్య గౌడ్ 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 2009 2019లో కోమటిరెడ్డి బ్రదర్స్ విజయం సాధించడంతో భువనగిరి పార్లమెంటరీ ఈసారి ఎన్నికల్లో గెలుపు భుజాన వేసుకున్నారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులను పరిశీలిస్తే ప్రస్తుత | కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో అంతగా పరిచయం లేని వ్యక్తి అని ప్రచారం జోరుగా ఉంది. ఇతర పార్టీల నుంచి బీసీ అభ్యర్థులు బరిలో ఉండటం కొంత కాంగ్రెస్ కు కష్ట కాలమే అంటున్నారు. ముఖ్యమైన విషయము గత నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అదే ప్రభావం ప్రస్తుత పరిస్థితిలో పనిచేస్తుందని విశ్వాసం తో నాయకులు ఉన్నారనేది తెలుస్తుంది. నిజానికి మొన్నది అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న పూర్తి వ్యతిరేకత మాత్రమే కాంగ్రెస్ అనుకూలించింది అనే ఒక వాదన వినిపిస్తుంది. అదే నమ్మకంతో ఉంటే కాంగ్రెస్ కు కష్టకాలమే అంటున్నారు. పార్లమెంటరీ ఏర్పడిన తర్వాత 2009 2019లో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంతో కాంగ్రెస్ అనుకూలత దానికి తోడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిన గెలిపించే బాధ్యత కోమటిరెడ్డి బ్రదర్స్ భుజాన వేసుకోవడం పార్లమెంటరీ 5000 ఏడు నియోజకవర్గాల్లో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నకిరేకల్, మునుగోడు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఉండగా ఒక జనగామ మాత్రమే ఓఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గెలుపు సునాయాసం జనే అంచనాలు వేస్తున్నప్పటికీ బీసీ సామాజిక వర్గాలు కొంత చైతన్యవంతమై ఉన్నటువంటి పరిస్థితులు స్థానికంగా ప్రజల్లో ఎక్కువ సంబంధాలు ఉన్న నాయకుడికి టికెట్ ఇచ్చినట్లయితే బాగుండేది అనే అభిప్రాయం సైతం ఉంది. కాంగ్రెస్ గ్రశ్రేణి నాయకుల ఆలోచన మేము ఎవరిని పెట్టినా గెలిపించుకోగలమనే ధీమా కు వ్యతిరేకమైన ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు కొత్త ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఎంతసేపు ఎమ్మెల్యేల | మొదటి శ్రేణి నాయకులు చుట్టూ ప్రదక్షిణాల తో కాలం గడిపారని ఎన్నికల సన్న హక సమావేశం వినిపించిన కార్యకర్తల అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వాడన వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలమైన పరిస్థితులు ఆలోచిస్తే ప్రధానంగా నియోజకవర్గానికి అంతగా పరిచయం లేదు అనే ప్రచారం ప్రభావం చూపుతుంది ఒకటి రెండోవిషయానికి వచ్చేస్తే కొంతమంది రైతులలో నిరాశ తట్టి| లేపుతుంది రైతుబంధు విషయంలోనూ కొన్ని అంశాలు పాటంగానే విమర్శలకు అవకాశం కనిపిస్తుంది.కాంగ్రెస్ పార్టీలోనే కొంత అసంతృప్తి కూడా వ్యక్తం అవుతుంది గత పది సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని కష్టకాలంలో పని వేసిన నాయకులు కార్యకర్తలను అధికారం వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదు అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. ఎన్నికల సమయంలోనే మమ్మల్ని గుర్తిస్తూ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. తప్పు మా స్థితిగతులు పరిస్థితులపై ఆలోచించడం లేదని విమర్శనాస్త్రాలు సైతం వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలంటే గ్రామీణ ప్రాంత ప్రజల మనసులోకి వెళ్లాల్సిన అవసరం ఉందని క్రమించాల్సిన అవసరం ఉంది దానికి తోడు పార్టీలోని అన్ని వర్గాల అనుభవిఱ్ఱనైనట్టి నాయకులను కలుపుకొని పోయినట్లయితే పరిస్థితులు అనుకూలించే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. ఎమ్మెల్యేల మీదనే ఆధారపడటం వల్ల ఎమ్మెల్యేలతో కన్నా ద్వితీయ తృతీయ శ్రేణి కార్యకర్తలు నాయకులు ప్రజా సంబంధాలు దగ్గరగా ఉంటాయనేది ఒక బలమైన ప్రచారం దీనికి తోడు వారి నుంచి కాకుండా ఎమ్మెల్యేల మీదనే ఆధారపడితే ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రస్తుతానికి కొంతమందిని దగ్గరగా కొంతమందికి దూరంగా పెట్టిన పరిస్థితులు ఇబ్బందికరంగా మారవచ్చు అంటున్నారు.బిజెపి అభ్యర్థి ప్రధాన ప్రత్యర్థి బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉండటం 2014లో ఎంపీగా పోటీ చేసిన అనుభవం, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఘనవిజయం సాధించిన బూర సర్సయ్య గౌడ్ బరిలో ఉండటం వల్ల ఆయనకు గౌడ సామాజిక వర్గం నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు దానికి తోడు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలు తమదైన తరహాలో పట్టు ఉంది అనే ప్రచారం ఉంది. ఇప్పటికీ ప్రచారంలో నియోజకవర్గం ప్రజలపై సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. నియోజకవర్గ స్థితిగతులు ఓటు బ్యాంకు తీరుపై పూర్తి అవగాహన ఆలోచన నుండి తనదైన వ్యూహరచన ప్రణాళికతో జనంలో చొచ్చుకపోయే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అందులో భాగంగా ప్రధాన పట్టణాలలో ప్రముఖులు ఉద్యోగులు వ్యాపారులు చోటా మోటా నాయకులు మార్నింగ్ వాక్కు కార్యక్రమంలో వారితో సమావేశమై పార్టీలకతీతంగా నన్ను గెలిపించాలంటూ ప్రాదయపడుతున్న తీరుపై స్పందన వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నియోజకవర్గం ముత్తం ఒక దప్పా చుట్టుముట్టారు. తనదైన ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం 400 సీట్లు సాధించి రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మద్దతు కూడగట్టుకుంటూ ప్రచారం చేయటం ఆలోచించదగ్గ విషయమేఅంటున్నారు.

 

బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ కురువు సామాజిక వర్గాలు చెందిన అభ్యర్థి ఒక్క ఇబ్రహీం పట్టణం అసెంబ్లీ నియోజకవర్గం తప్ప అంతగా ప్రచారం లేదు అనేది ఒకటి రెండో విషయానికి వచ్చేసి ఓడిపోయిన అటువంటి శాసనసభ్యులు ఏదో మొక్కుబడిగా పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని వినిపిస్తున్న ప్రచారం. కార్యక్రమాలు అప్పుడు మాత్రమే కనపడుతుంది అతనికి అందుబాటులో లేరనేది వినిపిస్తుంది. ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వంతో కలుపుకొని ప్రచారానికి చేస్తున్నారనేది అంతగా ప్రభావం చూపదు. లేదంటున్నారు. ఇప్పటివరకి బీఆర్ఎస్ ఓటమి నుంచి తేరుకోలేదని పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకులు దానికి తోడు స్థానికంగా ఉన్న ప్రజాప్రతితులు కాంగ్రెస్ పార్టీకి వలసలు పోవడం కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు లేకపోలేదు ఈ విషయంతో చూస్తే టిఆర్ఎస్ పరిస్థితి అనుకూలంగా మలుచుకోవడానికి శ్రమించాల్సిందే కంటున్నారు జనగామ మాత్రమే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిద్యం వహిస్తున్నారు మిగతా జరు నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితులు అంతంత మాత్రమే అని ఉన్నాయని అంటున్నారు. సిపిఎం అభ్యర్థి భువనగిరి పార్లమెంటరీ పరిధిలో పేరు నియోజకవర్గాలలో గతంలో సిపిఎం ప్రాతినిధ్యం వహించిన జనగామ తుంగతుర్తి నకరికల్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలలో బలమైన క్యారర్ ఉంది అనేది ఒక ఆలోచన వినిపిస్తుంది. మరోవైపు భవనగిరి అలేరు అసెంబ్లీ నియోజకవర్గాలలో చెప్పుకోదక్క ఓటు బ్యాంకు సిపిఎం ఓటు బ్యాంకు ఉంది దీనికి తోడు కొంత ఓటు బ్యాంకు ను ప్రజల్లో మలుపుకోగలిగితే ప్రధాన పార్టీల సవాల్ చేయగల పరిస్థితి ఏర్పడనుందంటున్నారు. చతుర్ముఖ వ్యూహంలో ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బిజెపి ఈమధ్య కనపడుతున్న సిపిఎం, బిఆర్ఎస్ కూడా తక్కువేము లేదని ప్రచారం సైతం ఉంది. ఎది ఏమైనప్పటికీ తీరా ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేసరికి కల్ల పరిస్థితులు తారు మారైన కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా బయటికి రాకపోతే కష్టకాలం తప్పడనేది ఒక వాదన ఎంతసేపు మాటలతోటి బతి విశ్వాసంతోటి కాలం గడపడం ఇబ్బందికి తప్ప అంటున్నారు బలమైన ఓటు బ్యాంకు కలిగినటువంటి ఎస్సీ, బిసి సామాజిక వర్గాలు ఆలోచన దిగాల్సిన అవసరం అంటున్నారు

 

Related News

Select the Topic
Scroll to Top