హైదరాబాద్ మే 7 (ఈతరం భారతం న్యూస్ );మతం పేరుతో కార్మికులను చీల్చే కుట్రలకు వ్యతిరేకంగా యావత్ కార్మికవర్గం సంఘటితంగా ఉద్యమించాలని సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్ పిలుపునిచ్చారు. ఐ.ఎఫ్.టి.యు.(శ్రామిక స్పందన) ఆంద్ర, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 138 వ మేడేను పురస్కరించుకుని మే-7, 2024, మంగళవారం రోజు హైదరాబాద్, బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేడే జాతీయ సదస్సు ఇఫ్టూ ఆంద్ర కార్యదర్శి కె.నర్సన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎం.ప్రబాకర్ ప్రసంగిస్తూ ప్రపంచ కార్మికవర్గ చరిత్రలోనే చిరస్మరణీయమైన రోజు మే 1 వ తేదీ అని, అత్యంత ప్రాదాన్యతను సంతరించుకున్న రోజే మేడే-1886 అని గుర్తుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రామిక, ప్రజా బాహుళ్యానికి పోరాడే చైతన్యాన్ని మేడే అందించిందని వెల్లడించారు. ప్రపంచ కార్మికులారా ఎకంకండి అనే నినాదాన్ని ఎత్తిపట్టడానికి మేడే కారణం అయ్యిందని గుర్తుచేశారు. ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా సామ్రాజ్యవాదం, దాని మిత్ర దేశాల నాటో కూటమి జరుపుతున్న అంతర్యుద్దాలను, దేశాల మద్య సరిహద్దు వివాదాలను మరియు చేపడుతున్న సైనికచర్యలను తీవ్రంగా ఖండించాలని కోరారు. రష్యా-ఉక్క్రైన్, ఇజ్రాయెల్-పాలస్తీనా మద్య యుద్దాలు ప్రపంచ దేశాల మద్య యుద్ద వాతవరణానికి తెరలేపనున్నాయని అంతర్జాతీయ సమాజానికి గుర్తుచేశారు. మన దేశంలో నరేంద్ర మోదీ బిజేపి ప్రభుత్వం అమెరికా, ఇతర దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాలకు పెద్దపీట వేసిందని, గత పదేళ్ళ కాలంలో కార్పొరేట్ శక్తుల దోపిడికి అడ్ఠు అదుపు లేకుండా, జాతీయ సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దోచి పెట్టిందని ఎండగట్టారు. గత నాలుగు సంవత్సరాలుగా కోవిడ్-19 సంక్షోభం వల్ల ఉపాదిని కోల్పోయిన సామాన్య పేద, మధ్యతరగతి ప్రజానీకం బ్రతుకులను వీదినపడేసి, బడా కార్పోరేట్ల ఆదానీ, అంబానీల దోపిడీకి అనుకూలంగా జీ ఎస్టీ, నోట్లరద్దు చేపట్టిందని అన్నారు. డీజిల్, పట్రోల్, వంటగ్యాస్, కరెంట్ చార్జీలు, నిత్యవసర వస్తువుల దరలను విపరీతంగా పెంచి, ప్రజల నడ్డివిరిచింది అర్థాకలి, పస్తులు, ఆత్మహత్యలకు గురిచేసింది. సామాన్య పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలను మెల్లమెల్లగా రద్దుచేసింది. విదేశీ కంపెనీలకు, బడా పరిశ్రమలకు అనేక సబ్సిడులు, సదుపాయాలను కల్పించి, లక్షలాది చిన్న, మద్యతరహా పరిశ్రమలు మూతపడి, కోట్లాదిమంది కార్మికులు రోడ్డున పడ్డానికి కారణం అయ్యిందని ఆగ్రహించారు. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామి చట్టాలను నిరంకుశంగా అమలు జరిపి, ఉపాది, నిరుద్యోగం, అదికధరలు, అసమానతలు, ఆరోగ్యం లాంటి తదితర సమస్యలపై ప్రశ్నించి, పోరాడుతున్న ఉద్యమ సంఘాల నాయకులపై, కార్యకర్తలపై ఉక్కుపాదం మోపిందని తెలియజేశారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి, సాదించుకున్న కార్మిక చట్టాలను ఏకపక్షంగా 4 లేబర్ కోడ్ లుగా మారుస్తూ చట్టం చేసి, మరింత బానిసత్త్వంలోకి కార్మికవర్గాన్ని నెట్టివేసిందని మండిపడ్డారు. పోరాడి సాదించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కాలరాయడమే గాకుండా మతతత్వ రాజకీయ విధానాలకు పాల్పడిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో దేశవ్యాప్తంగా హిందూత్వ వాదం పేరుతో ఆదివాసులు, దళితులు, ముస్లిం, క్రిష్టియన్ ఇతర మైనార్టీ వర్గాల ప్రజలపై సామూహిక అత్యాచారాలకు, హత్యలకు, దాడులు, దౌర్జన్యాలకు మత విద్వేష రాజకీయాలకు పాల్పడిందని అన్నారు. మణిపూర్, హర్యానా తదితర ప్రాంతాల ప్రజల మద్య ఘర్షణలను రాజేసిందని, 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని మెజారిటీ హిందూ ఓట్లను కొల్లగొట్టెందుకు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టి, మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని అందించే సీఏఏ ను అమలుచేసిందని అన్నారు.
విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు బ్యాకు ఖాతలో వేస్తామని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నీతివంతమైన పాలనను అందిస్తామని చెప్పిన బీజేపీ, అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఇటీవల ఎలక్షన్ కమీషన్ ప్రకటించిన బాండ్ల వివరాలు మోడీ ప్రభుత్వ అవినీతి వసూళ్లు భయట పెట్టాయని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ రైతాంగం 3 నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిపిన రాజీలేని పోరాటం ప్రదాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాల తల పొగరును దింపి, 750 మందికి పైగా చలి, ఎండ, వానలను సహితం లెక్కచేయకుండా తమ ప్రాణాలను దారపోశారని అన్నారు. ఇలాంటి త్యాగపూరితమైన ఉద్యమాల స్పూర్తితో కార్మికవర్గం ముందుకు వెళ్ళాలని, మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పాలకులు అనుసరిస్తున్న దుర్మార్గమైన విదానాలే కారణం అని గుర్తించి, వీటికి వ్యతిరేకంగా అత్యంత చైతన్యవంతమై సంఘటితంగా కార్మక వర్గం పోరాడాలని కోరారు. కాబట్టి మే-13 న జరిగే ఎన్నికల్లో అభ్యుదయ, ప్రజాస్వామ్య, విప్లవ సంస్థలను బలపరిచి, అభివృద్ధి నిరోదక, అవకాశవాద దళారి దోపిడీ పాలకవర్గ పార్టీలకు చెందిన అభ్యర్థులను బలంగా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఈపై కార్యక్రమంలో ఇఫ్టూ శ్రామిక స్పందన జాతీయ కార్యదర్శి షేక్ షావలి, భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి చిట్టిబాబు, భారత ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంపంగి పద్మ, ఏపిఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతూరి అంజినేయులు, దక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ రషీద్ ద్రావిడ, ఎస్. సుదాకర్, సైయద్ మైమూద్, పి.సునీత, అరుణ, అనీఫ్ తదితరులు పాల్గొన్నారు
.















