ఈతరంభారతం హైదరాబాద్ ప్రతినిధి మే 7 2024 : మంగళవారం కురిసిన భారీ వర్షం హైదరాబాద్ ను అత లాకుతలం చేసింది .హైటెక్ సిటీ ,మియాపూర్ ,కూకట్పల్లి ,జేఎన్టీయూ, మాదాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ,సికింద్రాబాద్ ఏరియాలో వర్షం కారణంగా రోడ్లపై మోకాళ్ళ లోతు వరకు నీళ్లు వచ్చాయి. వాహనాలు ఎక్కడికక్కడ రోడ్లపై భారీగా నిలిచిపోయాయి. పలుచోట్ల ఈదురు గాలుల కారణంగా చెట్లు విరి గిపడ్డాయి .వర్షం అత్యధికంగా శేర్లింగంపల్లిలో 10.8 సెంటీమీటర్లు ,సికింద్రాబాద్లో 8.4 ,కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో 7 సెంటీమీటర్లు నమోదయింది.















