EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నైతిక విలువలతో మీ భవితవ్యం వెలుగులు చూడాలి    -హనుమకొండ జిల్లా అధనపు కలెక్టర్ రాధికా గుప్త

హనుమకొండ మే 8 (ఈతరం భారతం న్యూస్ );హనుమకొండ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల 28 నుండి నిర్వహింపబడుతున్న “బాల సంస్కార్-2024 వేసవి శిబిరం నేడు 10వ రోజు ముగింపు వేడుకలతో విజయవంతమైంది. ఈ వేడుకలకు హనుమకొండ జిల్లా అధనపు కలెక్టర్ రాధికా గుప్త ముఖ్య అతిథిగా హజరై దిశా దశ నిర్దేశం చేసారు. తాను ఓ మారుమూల గ్రామ బిడ్డగా యూపీఎస్సీ సాధించడానికి రెండు సవాళ్లు ఎదుర్కొన్నానని, తమ గ్రామంలో, పెద్దగా ఆడపిల్లలు చదువుకోలేదని ఆమె చెప్పారు. అయితే, తన తల్లి ప్రోత్సాహంతో తాను చిన్న తనం నుంచే కష్టపడి చ‌దివాన‌న్నారు. తన చదువు తర్వాత.. ఉద్యోగం వచ్చినా.. యూపీఎస్సీ కోసం ఆ ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు. అయితే.. తర్వాత మళ్లీ ఉద్యోగం వస్తుందో రాదో అనే కంగారు ఉండేదని.. ఆ సవాలును ఎదుర్కొనడానికి చాలా కష్టపడ్డానని చెప్పారు. దాదాపు రెండేళ్ల పాటు..కష్టపడి తాను యూపీఎస్సీ 18వ ర్యాంకు సాధించాన‌న్నారు. రాధికా ఐఏఎస్ గారి స్పూర్తిని, సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకొని మీ తల్లిదండ్రులు గర్వపడేలా నైతిక విలువలతో ఎదుగాలని సేవా సమితి అధ్యక్షులు కటంగూరు సత్యనారాయణ రెడ్డి బాలసంస్కార్ లో పాల్గొన్న చిన్నారులను కోరారు.జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, అప్పిరెడ్డి పల్లె వాస్తవ్యులు, 2024 పద్మశ్రీ పురస్కార గ్రహీత, చిందు కళాకారుడు గడ్డం సమ్మయ్య విశిష్ట అతిథిగా హాజరు కావడం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. వీరిది కూడా ఓ మారుమూల గ్రామం, నిరుపేద కుటుంబం, చిందు యక్షగానమే వృత్తి. చదివింది కేవలం ఆరో తరగతి. తండ్రి దగ్గరి నుంచి పునికి పుచ్చుకున్న యక్షగాణ కళను, 12 వఏట చిన్ని కృష్ణుడి వేషంతో మొదలు పెట్టినట్లు, సుమారు 50 ఏళ్లుగా ఆ కళామతల్లికి సేవ చేస్తున్నట్లు, ఇప్పటివరకు ఏకంగా 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు, ఆ రంగమార్తాండుడిని మెచ్చి పద్మశ్రీ పురస్కారం వెతుక్కుంటూ వచ్చి వరించినట్లు, అలాచిన్ని కృష్ణుడి నుంచి పద్మశ్రీ వరకు ఆయన ప్రస్థానం సాగిందన్నారు. ఇలా బాలసంస్కార్ ముగింపు వేడుకలో ఒకరు ఐఏఎస్, మరొకరు పెద్ద బాల శిక్ష తో కూడిన 6 వ తరగతి పరిజ్ఞానం. ఇద్దరూ మారుమూల గ్రామంనుండి ఎదిగినా నేటి బాలబాలికలకు ఆదర్శంగా ప్రత్యక్ష సాక్షులయ్యారని, సభ్యసమాజానికి అభినందనీయులయ్యారని ప్రశంసలు పొందారు. ఈ ముగింపు వేడుకలో సేవాసమితి బాధ్యులు, వాలంటీర్లు డా॥ రామకృష్ణ మహోదయ్, కేవిరావు, తిరుపతి రెడ్డి, సూర్య, పేట శ్రీనివాస్, బల్లా శ్రీనివాస్, విష్ణు, రాధిక, అనిత, పార్వతి, శిల్ప, వీణ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top