న్యూ ఢిల్లీ మే 8 (ఈతరం భారతం న్యూ స్);: ఏపీలో తెలుగుదేశం పార్టీ – జనసేన- బీజేపీ కూటమి 145 సీట్లు సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు జోస్యం చెప్పారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రిజర్వేషన్ అంశాన్ని ముట్టుకోదని, బ్రిటిష్ చట్టాలను మార్చే అవకాశం ఉందని అన్నారు. రాజ్యాంగ సవరణ ఉంటుంది, అందులో రిజర్వేషన్ అంశం ఉండదని గోనె ప్రకాష్ రావు పేర్కొన్నారు.
జగన్ వై నాట్ 175 అన్నాడు..అలాంటప్పుడు ఇతరులను వేరే చోటు నుంచి ఎందుకు పోటీకి నిలబెట్టారని ప్రశ్నించారు. పొత్తు వల్ల టీడీపీకి కొంత నష్టం జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర అభివృద్ధి నేతృత్వంలో జరుగుతుందని చెప్పారు. బీజేపీ జగన్ ను వదిలేసిందని అంటే అతను ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నాడని అర్థమని అన్నారు.జగన్ తన చెల్లి(షర్మిల)ని వదిలేసాడు, బాబాయిని చంపాడని విరుచుకుపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. సొంత చెల్లెను వదిలేసి జగన్ ఇతరులను చెల్లెలు అంటున్నాడని ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణను జగన్ తండ్రితో సమానం అంటున్నాడు జగన్ కు సిగ్గుందా అని ఎద్దేవా చేశారు. మంత్రి రోజా రాజశేఖర్ రెడ్డిని ఇష్టానుసారంగా తిట్టాలేదా అని ప్రశ్నించారు.దేశంలోనే ఏపీలోని వైసీపీ అవినీతి ప్రభుత్వమని అన్నారు. వందల కోట్ల రూపాయలు లిక్కర్, ఇసుక, మైనింగ్ లో సంపాదించారని విమర్శించారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు , ఒక్క రాజధాని లేదని మండిపడ్డారు.















