హైదరాబాద్ మే 8 (ఈతరం భారతం న్యూ స్);మే-13 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యదయ, ప్రజాస్వామ్య, లౌకిక స్వతంత్ర అభ్యర్థులను మరియు వివిధ మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీల విప్లవ సంస్థలకు చెందిన అభ్యర్థులను బలపర్చి, అభివృద్ధి నిరోధక, అవకాశవాద దళారి దోపిడీ పాలకవర్గ పార్టీలకు చెందిన అభ్యర్థులను బలంగా తిరస్కరించాలని సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్ విప్లవ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. బాగ్ లింగంపల్లిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల భూటకత్వాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టండి!కార్పొరేట్ మనువాద దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా జరిగే వర్గపోరాటాలలో భాగస్వాములు కండి!! అనే కరపత్ర ఆవిష్కరణ సభ భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి చిట్టిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మల్లెపల్లి ప్రభాకర్ ప్రసంగిస్తూ భడాభూర్జువా, భూస్వామ్య, సామ్రాజ్యవాద ప్రయోజనాలను పరిరక్షించే పార్టీల పట్ల ప్రజలకు ఎలాంటి బ్రమలు ఉండనవసరం లేదని అన్నారు. వర్గ పోరాటాలు, ప్రజాఉద్యమాలలో భాగస్వాములై వ్యవసాయిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం ద్వారానే ప్రజల మౌళి సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంతీయ రాజకీయాలతో ప్రజల మద్య విద్వేషాలు పెంచే కుల, మత, ప్రాంతీయ వాదులకు చెందిన అభ్యర్థులను బలంగా నిలదీయాలని కోరారు. ఇలాంటి వారివల్ల ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం, ఆత్మహత్యలు లాంటి రుగ్మతలతో దేశ ప్రజలు అల్లాడి పోతున్నారని గుర్తుచేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అవి బడాబాబుల కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పాటుపడేవే తప్ప, ప్రజల ప్రయోజనాలను నెరవేర్చే పార్టీలు కావని ఎత్తిచూపారు. అప్పులతో దేశాన్ని తాకట్టుపెట్టి, అన్ని రంగాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేశారని అన్నారు. ఇలాంటి క్రమంలో ఆదివాసులు, దళితులు, మేదావులు, మైనార్టీ ప్రజలు తమపై జరుగుతున్న అన్నిరకాల దోపిడీ, పీడన, అణిచివేత, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా వివిధ సెక్షన్ల ప్రజానీకం తమ మనుగడ కొరకు జరుగుతున్న పోరాటాలకు మద్దతుగా నిలబడి, ముందుండి ఉద్యమించాలని కోరారు. ఈపై కార్యక్రమంలో ఐపిఓడభ్ల్యూ సంపంగి పద్మ, పెర్క సునీత, బొనుగుల లలిత, అరుణ, బానుబేగం, ఐపివైఎల్ బానోత్ సంతోష్ నాయక్, ఇఫ్టూ(శ్రామిక స్పందన) షేక్ షావలి, ఎస్.సుదాకర్, కె.నర్సన్న, అనీఫ్, ఏపిఎంఎస్ మంతూరి అంజినేయులు, లావణ్య, ధక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య మహ్మద్ రషీద్ ద్రావిడ, సైయద్ మైమూద తదితరులు పాల్గన్నవారిలో ఉన్నా
రు.















