EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ గ్రామం నుండి పలు కుటుంబాలు భారతీయ జనతా పార్టీలోచేరిక

08.05.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

భారతీయ జనతా పార్టీ తల్లాడ మండల శాఖ ఆధ్వర్యంలో తల్లాడ మండలంలో అంబేద్కర్ నగర్ గ్రామం నుండి పలు కుటుంబాలు భారతీయ జనతా పార్టీలో జిల్లా కార్యవర్గ సభ్యుడు చల్లా నాగులు మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు.ఈరోజు ఖమ్మంలోని ఖమ్మం పార్లమెంటరీ కార్యాలయము నందు పార్లమెంటు అభ్యర్థి శ్రీ తాండ్ర వినోద రావు తనయుడు తాండ్రవినీతి రావు జిల్లా ఉపాధ్యక్షుడు గుత్త వెంకటేశ్వరరావు తల్లాడ మండలం లోని అంబేద్కర్ వాసులైన మాజీ వార్డు సభ్యులు వరపర్ల రామారావు దొడ్డ ప్రభాకర్ కోపల రాజారావు జినుగు కిరణ్ తంబల ఆశీర్వాదం లకు వినీత్ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంటు పరిధిలో రోజురోజుకు పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ గెలుపు దిశలో పయనిస్తుందని ఖమ్మం ఖిలాపై మన కాషాయపు జెండా ఎగురువేయడం ఖాయం అనిపిస్తుందని రోజు రోజుకి వేలాదిమంది గ్రామీణ ప్రాంతాల నుంచి పార్టీలో చేరుతున్నారని సర్పంచులు ప్రజా ప్రతినిధులు ప్రజలు యువత స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవుతున్నారని భారత పార్లమెంటులో మరల నరేంద్ర మోడీ ఏ ప్రధానమంత్రి అవుతారని ఖమ్మం కూడా గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ప్రజా నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరి వినోద రావు గెలవాలని వారి గెలుపు కోసం మేమంతా కృషి చేస్తామని చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఖమ్మం జిల్లాలో కమలం వికసించడం ఖాయం అయిపోయిందనిపిస్తుంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు జిల్లా ఉపాధ్యక్షులు గుత్త వెంకటేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లా నాగులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top