EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పోలింగ్ ఏజెంట్ల నియామకం విషయంలో ఈసీ కీలక నిర్ణయం   ఏజెంట్లకు పోలీసు, రిటర్నింగ్ అధికారి వెరిఫేకషన్, ఆమోదం అవసరం లేదు పోలీసు కేసులు ఉన్నా ఏజెంట్‌లుగా పనిచేయవచ్చు

అమరావతి, మే 10 (ఈతరం భారతం న్యూస్ ):: ఏపీలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అలాగే పోలింగ్ ఏజెంట్ల నియామకం విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. సహజంగా పోలింగ్‌ బూత్‌లలో పోలింగ్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లను ఏజెంట్లు గుర్తించిన తర్వాతే వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తారు పోలింగ్ సిబ్బంది. ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో అభ్యర్థుల తరపున ఏజెంట్లను నియమించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీచేసింది.పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పించి నేరుగా విధులకు హాజరు కావచ్చని ఆదేశాలు జారీ చేసింది. గతంలో చేసినట్లు ఏజెంట్లకు పోలీసు, రిటర్నింగ్ అధికారి వెరిఫేకషన్, ఆమోదం అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలింగ్ ఏజెంట్ల విషయంలో అధికార దుర్వినియోగం జరగకుండా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. పోలీసు కేసులు ఉన్నా ఏజెంట్‌లుగా పనిచేయవచ్చని పేర్కొంది. ఏజెంట్ల నియామకం విషయంలో పోలీసులు అభ్యంతరాలు తెలిపే అధికారం లేదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 

 

Related News

Select the Topic
Scroll to Top