జోగులాంబ గద్వాల మే 10 (ఈతరం భారతం న్యూ స్);బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య పై జరిగిన దాడి పిరికిపంద చర్యఅని , దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తిలో జరిగిన వైసిపీ పార్టీ బహిరంగ సభ లో టిడిపి గుండాలు దాడికి పాల్పడటం యావత్ బడుగు బలహీన అనా గారిన వర్గాలు ప్రజాస్వామ్యం పై జరిగిన దాడిగా తట్టే మహేష్ అభివర్ణించారు.ఆర్ కృష్ణన్న పై దాడి చేసిన వ్యక్తులను, చేయించిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తట్టే మహేష్ డిమాండ్ చేసారు.ఆయనకు మరింత భద్రత ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేసారు.















