EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మాదిగ, మాదిగ ఉపకులాల ఐక్య వేదిక మద్దతు       మాదిగల ద్వారనే సిద్దించిన తెలంగాణా రాష్ట్రం తెలంగాణ మాదిగలు, మాదిగ ఉపకులాల ఐక్య వేదిక నేతలు

హైదరాబాద్ మే 10 (ఈతరం భారతం న్యూ స్);పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ మాదిగలు, మాదిగ ఉపకులాల ఐక్య వేదిక కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శుక్రవారం హైదర్ గూడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి చైర్మన్ రేణికుంట్ల ఎల్లయ్య, ప్రజాబంధు యాకస్వామి,మాదిగ ఉపకులాల జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం, దళిత రత్న కీసర మురళి మాదిగ,దళిత క్రైస్తవ సేనాధిపతి డా. డేవిడ్ కడారి,బుడగ జంగాల జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు `తదితరులు మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమంలో మాదిగలు ముందు వారసలో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి ఒప్పించి, ఇప్పించి, తెచ్చింది మాదిగలే ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ ప్రకటించగానే ఆనాటి హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే (మాదిగ) ఫైల్ పై సంతకం పెట్టడం జరిగిందన్నారు. వెంటనే పార్లమెంట్ స్పెకర్ ఆలస్యం చేయకుండా మీరా కుమార్ (మాదిగ) పార్లమెంట్ నందు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించగానే అమర నిరాహార దీక్షలో కూర్చున్న మందకృష్ణ మాదిగ నిమ్మరసం ఇచ్చి కేసీఆర్ ను దీవించును విరమింప చేసిన ఘనత మాదిగలకే దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్ళిన బీసీలు, ఓసీ లేని గ్రామాలు ఉన్నాయని, కానీ మాదిగలు లేని గ్రామం ఉండదని వారు స్పష్టం చేశారు. గ్రామాల్లో చావు డప్పు కొట్టాలన్న, విందు వినోదాలకు, పెండ్లిలకు మాదిగలే డప్పు కొట్టాలని, చెప్పులు కుట్టాలన్న, సఫాయి పనులు చేయాలన్న మాదిగలే కావాలని, కానీ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క మాదిగ కూడా అవకాశం ఇవ్వలేదని.కంటోన్మెంట్ ఉప ఎన్నికల సీటు కూడా మాదిగలకు కేటాయించ లేదన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల తరువాత మాదిగలకు ఒక మంత్రి పదవీ తో పాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేషన్ పదవులు ఇస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు.పార్లమెంట్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాదిగ, మాదిగ ఉపకులాల సోదరులు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశం లో గజ్జెల ఎఅస్వర్ రావు,యాక స్వామి,గడిపే నాగయ్య,ఏనురి ఈశ్వరయ్య ,సంగీతం రాజలింగం,ఆనంద్ ప్రకాష్,పాకాల రాజ్ కుమార్,దక్కాలి మంగేష్ తదితరులు పాల్ గోన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top