హైదరాబాద్ మే 11 (ఈతరం భారతం న్యూ స్);తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో బిజెపి 10 సీట్లు గెలుస్తుందని చెప్పారు. హైదరాబాద్ లో అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం స్టీరింగ్ ఇంకా ఓవైసీ చేతిలోనే ఉందన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటిఎంలా మారిందని విమర్శించారు. దక్షిణాదిలో బీజేపీ అధ్భుతంగా విజయం సాధించబోతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.ప్రధాని మోదీ అధికారం చేపట్టిన పదేళ్లలో ఆయనపై ఒక్క అవినీతి మరక, ఆరోపణలు లేవని అమిత్ షా పేర్కొన్నారు. కొంచం ఉష్ణోగ్రతలు ఎక్కువైనా విదేశాలకు వెళ్లే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమకు పోటీనే కాదని షా అన్నారు. సర్జికల్స్ స్ట్రైక్స్ గురించి సిఎం రేవంత్ రెడ్డి తమాషాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జికల్స్ స్ట్రైక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాక్ లో ఉగ్రవాదులను ఏరి పారేశామని అమిత్ షా స్పష్టం చేశారు. పాక్ అక్రమిత ప్రాంతం భారత్ ఆదీనంలోనే ఉంటుందని, కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భంగాగానే ఉంటుందని, అయోధ్యంలో రామమందిరం అంశాన్ని 70 ఏళ్లుగా కాంగ్రెస్ నాన్చుతూ వచ్చిందన్నారు.ఈ సమావేశం లో పార్టీ రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి,మల్కాజ్గిరి ఎం పీ అబ్యర్తి ఈటెల రాజేందర్,పార్టీ సేనియర్ నేత లక్ష్మణ్,ఎన్.వి.సుబాష్,మీడియా ఇంఛార్జి మౌనిక సుంకర తదితరులు పా ల్గొన్నారు.















