హైదరాబాద్ మే 11 (ఈతరం భారతం న్యూ స్);హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నివాసి కడియాల ఆనంద్ కుమార్ నిరుపేద స్వర్ణకారులు. అవివాహితుడైన ఆయన, వృత్తిలో సరైన ఆదాయం లేక చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ వృద్దాప్యంలో ఉన్న తన తల్లి(85)తో జీవిస్తున్నారు.దురదృష్టవశాత్తు ఎడమ తుంటి కీలుకి టీబీ సోకడంతో ఎముక ఉబ్బి నడవలేని స్థితిలో గత మూడు నెలలుగా మంచానికే పరిమితమయ్యారు. తల్లికి వచ్చే రెండు వేలమందిని పెన్షన్ మరియు బంధు మిత్రుల ఆర్థిక సహాయంతో ఇంటి అద్దె, నిత్యావసరాలు తీర్చుకుంటున్నారు.హైదరాబాద్, నిమ్స్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేయడం అవసరం అని అందుకు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, లక్ష రూపాయలు ఆరోగ్య శ్రీ లో సర్దుబాటు జరుగుతుందని తెలియ చేసారు.ఆనంద్ గారి బంధువు మరియు కుత్బుల్లాపూర్ స్వర్ణకార సంఘ అధ్యక్షులు కడియాల రామాచారి తమ సంఘం తరఫున సుమారు ₹25000/- వరకు సహాయం చేసారు. సర్జరీ కొరకు మిగిలిన రూ.75,000/-ల సహాయం కోసం వెస్సోని సంప్రదించారు. వెస్సో గౌరవ దాతల సహకారంతో ఆనంద కుమార్ కు రూ. 63,400/- అందచేసింది. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూవైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న ఆనంద్ సహాయం చేసి ఆదుకొన్న గౌరవ దాతలకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.
–















