EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఖాళీగా కనిపిస్తోన్న హైదరాబాద్ నగరం

హైదరాబాద్ మే 12 (ఈతరం భారతం న్యూ స్);: ఓట్ల పండుగకు కొద్ది గంటలే సమయం ఉంది. దీంతో జనాలంతా స్వస్థలాలకు బయలుదేరి వెళుతున్నారు. హైదరాబాద్ నగరమంతా ఖాళీగా కనిపిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏపీకి బండ్లు క్యూ కట్టాయి. ఎన్ని బస్సులు వేసినా చాలడం లేదు. రైళ్ల పరిస్థితి కూడా అంతే ఉంది. ఇక ఎల్బీనగర్ – విజయవాడ హైవే మార్గంలో చెప్పాల్సిన పని లేదు. అడుగడుగునా ట్రాఫిక్ జామ్. బండి కదిలితే ఒట్టు. అంతగా ట్రాఫిక్. ఏదో కదలాలా వద్దా అన్నట్టుగా కదులుతున్నాయి. ఈ ట్రాఫిక్‌లో వాహనదారుల ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి. హైదరాబాద్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులంతా తెలంగాణ నుంచి ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల పైనే ఆధారపడ్డారు.

కిక్కిరిసిపోయిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌..

ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు నగరంలో ఉంటున్న ఆంధ్రా ఓటర్లు రైలెక్కుతున్నారు. లక్షలాదిమంది ప్రయాణికులు రావడంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కిక్కిరిసిపోయింది. రైళ్లలో రిజర్వేషన్లు దొరకనివారు కిక్కిరిసిన జనరల్‌ బోగీల్లో ప్రయాణం చేసేందుకు కుస్తీలు పట్టారు. భార్యాపిల్లలతో వెళ్తున్నప్పటికీ ఎంత కష్టమైనా సరే.. ఊరు చేరితే చాలన్నట్లుగా పోటీ పడ్డారు.అయితే, రిజర్వేషన్‌ బోగీలో సాధారణ ప్రయాణికులు ఎక్కకుండా ఉండేందుకు శనివారం ఆర్పీఎఫ్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్‌ సీఐ సరస్వత్‌ తెలిపారు. మరోవెపు జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్ల తోపాటు ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్ల పాయింట్లు కూడా కిటకిటలాడాయి. ఓటు వేసేందుకు నగరం నుంచి భారీగా ప్రజలు తరలి వెళ్లారు. శనివారం రాత్రి ఏపీ వైపు వెళ్లే బస్సులతో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ అమీర్‌పేట, లక్డీకపూల్‌ తదితర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top