EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మూడు రోజులుగా విద్యుత్‌ లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరించిన గిరిజనులు

కొల్లాపూర్‌ మే 13 (ఈతరం భారతం న్యూ స్);: రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు కోతలు లేవని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాటలు వట్టి కోతలేనని మరోసారి రుజువైంది. ఏకంగా సీఎం సొంత జిల్లాలోని ఓ తండా మూడు రోజులుగా విద్యుత్‌ లేకపోవడంతో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. కరెంటు వచ్చేవరకు ఓటేసేది లేదని ఆందోళనకు దిగారు. దీంతో ఓటర్లు లేకపోవడంతో ఆ ఊర్లోని పోలింగ్‌ కేంద్రంలో అధికారులు ఖాళీగా ఉండిపోయారు.నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం అమరగిరి చెంచు గూడెంలో మూడు రోజులుగా కరెంటు లేకపోవడంతో గ్రామస్థులు ఓట్లు వేయకుండా ఆందోళనకు దిగారు. గత మూడు రోజుల నుంచి కరెంట్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము చెంచులమన్న ఉద్దేశంతోనే ఎవరూ ఇటువైకూడా రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top