న్యూ డిల్లీ మే 15 (ఈతరం భారతం న్యూ స్); : ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది . ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవాహర్రెడ్డి, రాష్ట్ర డీజీపీ హారీష్కుమార్ కు సమన్లు జారీ చేసింది.పల్నాడు, చంద్రగిరి, తిరుపతి,తాడిపత్రి, నంద్యాల జిల్లాలో జరిగిన హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ప్రశ్నిస్తూ శుక్రవారం వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది . పోలింగ్ జరిగిన రెండు రోజులు కావస్తున్న రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అల్లర్లు అదుపులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.















