ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి మే 16 2024 : గ్రేటర్ వారాసిగూడ పద్మశాలి సంఘం ఆధ్వర్యం లో పద్మశాలి ముద్దుబిడ్డ ఎనుగంటి రాజు నేత జన్మదిన సందర్బంగా ఆయన ను సన్మానించారు. కార్యక్రమం లోఅధ్యక్ష డు బొమ్మ నరేందర్ మాట్లాడుతు వారు మలిదశ తెలంగాణ ఉద్యమనేత, సామాజిక తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, విద్యార్థి నిరుద్యోగుల సమస్యల పోరాటంలో 3 నెలలు జైలుకు వెళ్లారని చెప్పారు. నాగార్జున సాగర్ కంటెస్టెడ్ యం.యల్.ఏ అయిన రాజు కి సంఘాలలో కూడామంచి గుర్తింపు ఉంది.నేడు బీజేపి తెలంగాణ స్టేట్ ఓబీసీ మోర్చ అధికార ప్రతినిధి అని వివరించారు వారు భవిష్యత్తులో పద్మశాలి సమాజానికి మేలు కలిగే పనులు చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో పూల మారుతి, దాస రాజేశ్వర్, గోలి జనార్థన్, వల్లపు క్రిష్ణమూర్తి, శ్రీధర్ బొమ్మ, బౌద్దనగర్ యువమోర్చ లడ్డు పాల్గొన్నారు.















