EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీకి త్వ‌ర‌లోనే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్: టీఎస్‌పీఎస్సీ

హైద‌రాబాద్ మే 17 (ఈతరం భారతం న్యూ స్);: గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి త్వ‌ర‌లోనే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ వెల్ల‌డించింది. జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన టీఎస్‌పీఎస్సీ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌ను 1:3 నిష్ప‌త్తిలో, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌ను 1:5 నిష్ప‌త్తిలో పిల‌వ‌నున్నారు.క‌మ్యూనిటీ, నాన్ క్రిమి లేయ‌ర్(బీసీల‌కు), పీడ‌బ్ల్యూడీ స‌ర్టిఫికెట్స్, స్ట‌డీ లేదా రెసిడెన్స్ స‌ర్టిఫికెట్స్(క్లాస్ 1 నుంచి ఏడు వ‌ర‌కు), రిజ‌ర్వేష‌న్ క‌లిగి ఉంటే దానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఏజ్ రిలాక్సేష‌న్, క్వాలిఫికేష‌న్ స‌ర్టిఫికెట్లు రెడీగా ఉంచుకోవాల‌ని టీఎస్‌పీఎస్సీ సూచించింది. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ స‌మ‌యంలో వీటిలో ఏ డాక్యుమెంట్ స‌మ‌ర్పించ‌క‌పోయినా ఆ అభ్య‌ర్థుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబోమ‌ని స్ప‌ష్టం చేసింది

.

 

Related News

Select the Topic
Scroll to Top