EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జూన్ 29న అమర్నాథ్ యాత్ర ప్రారంభం

న్యూ డిల్లీ మే 17 (ఈతరం భారతం న్యూస్);జమ్ముకాశ్మీర్ లో పవిత్ర అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. మొత్తం 53రోజులపాటు కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుందని అమర్నాథ్ బోర్డు తెలిపింది. లక్షల మంది భక్తులు వచ్చే ఈ యాత్రకు వెళ్లే రెండు రహదారుల్లో 12 క్రిటికల్ స్పాట్స్‌ను గుర్తించామని తెలపింది.ఈ ప్రాంతాల్లో భక్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే.. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలతో కూడిన మౌంటైన్ రెస్క్యూ టీమ్స్‌ సహాయం అందిస్తాయని చెప్పింది. సహాయక చర్యలు చేపట్టేందుకు జమ్ముకాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన 1,300 మంది సిద్ధంగా ఉంటారని తెలిపింది. కాగా, ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా గురువారం పిలుపునిచ్చారు

.

 

Related News

Select the Topic
Scroll to Top