EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

విశాఖలోని స్ట్రాంగ్‌రూమ్‌ లను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకె మీనా

విశాఖపట్టణం మే 18 (ఈతరం భారతం న్యూ స్);: రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకె మీనా శనివారం విశాఖలోని స్ట్రాంగ్‌రూమ్‌ లను పరిశీలించారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌ అనంతరం విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఈవీఎం యంత్రాలను ఏయూలో భద్రపరిచారు. ఈ సందర్భంగా సీఈవో స్ట్రాంగ్‌రూం లను అధికారులతో కలిసి పరిశీలించి అక్కడ ఉన్న అధికారులకు, భధ్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు.స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రతతో నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం లాగ్‌బుక్‌లో సంతకం చేశారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని ఆదేశించారు. అనంతరం విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లారు. ఆదివారం ఆయన విజయనగరంజిల్లాల్లో పర్యటించనున్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top