హైదరాబాద్ మే 18 (ఈతరం భారతం న్యూ స్);ఉచిత బస్సు సౌకర్యాల పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. చిన్న చిన్న అంశాల పై మాట్లాడి ప్రధాన మంత్రి స్థాయి దిగజార్చద్దని విజ్ఞప్తి చేసారు.మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాన మంత్రి స్థాయిలో జీర్ణించుకోలేక పోతున్నారు.కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయి..వాస్తవంగా ఆర్టీసి లో ప్రయాణానికి.మెట్రో ప్రయాణానికి సంబంధం లేదు..మెట్రో సెక్టార్ వేరు.ఇప్పటికీ కూడా మెట్రో లో బోగి లు పెంచాలని విజ్ఞప్తి చేసారు.ప్రధాన మంత్రి రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారా?బస్సు ప్రయాణం విషయంలో ప్రధాన మంత్రి ఎందుకు అలా మాట్లాడారని ప్రశ్నించారు.తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు.ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం..ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో మా ప్రయత్నాలు మరింత కొనసాగుతాయి.ప్రధాన మంత్రి మహిళలకు బస్సు సౌకర్యం పై ఆడిపోసుకోవడం బంద్ చేసుకోవాలి..ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఎదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు.ఇలా చిన్న చిన్న అంశాల పై మాట్లాడి ప్రధాన మంత్రి స్థాయి దిగజార్చద్దు..















