హైదరాబాదు (ఈతరం భారతం న్యూస్ );బిఆర్ఎస్ నేత హరీష్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధులు భవాని రెడ్డి విమర్శించారు.సోమవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ పదేండ్ల మీ పాలనలో ప్రజలు చీదరించుకొని మిమ్ముల్ని బౌన్స్ చేశారన్నారు.కొత్త గూడెంలో రైతులకు భేడీలు వేసింది ఎవరు ప్రజలకు తెలుసునని,ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని అసమర్థ పాలన కేసీఆర్ ది అని ఆమె దుయ్యబట్టారు.ప్రజలకి సుపరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆగస్ట్ 15 వరకు 2లక్షల ఋణమాఫి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని,ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కేటీఆర్ ,హరీష్ రావు లకు గుబ గుయ్యిమనేలాగ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుస్తుండన్నారు.రాకెష్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమాలు చేసిండా సమస్యల పై పోరాడిన తీన్మార్ మల్లన్న పై ఎన్నో కేసులు ఉన్నవన్నారు.















