EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జా తీయ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు వేగవంతం చేయాలి : కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్

ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

జా తీయ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు వేగవంతం చేయాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్

అన్నారు. సోమవారం ఢిల్లీ నుండి తెలంగాణ జిల్లాల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో పురోగతిలో ఉన్న జాతీయ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ లో చేపడుతున్న జాతీయ ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. విజయవాడ నుండి కాజీపేట వరకు 3వ రైల్వే లైన్ ఏర్పాటు పనులు నిలిచిన చోట సమస్యలు పరిష్కరించాలన్నారుఖమ్మం నగరం నర్తకి థియేటర్, మధ్య గేట్, బురహాన్ పురం, మల్లెమడుగు వద్ద రహదారి రిలోకేషన్ పనులు చేయాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ స్టేజ్-2 భూసేకరణ సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. దీనికి సంబంధించి ప్రిలిమినరి నోటిఫికేషన్ జారీచేయాలన్నారు. నాగ్ పూర్, అమరావతి జాతీయ రహదారి కి జెఎంఎస్ సర్వే చేపట్టి పూర్తి చేయాలన్నారు. జులై మాసాంతానికి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం నూతన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఎస్డీసి రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీవో గణేష్, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మీనన్, ఖమ్మం అర్బన్ తహశీల్దార్ సిహెచ్. స్వామి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top