టీఎస్ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోదం హర్షణీయం బండి
కరీంనగర్ సెప్టెంబర్ 14 (ఈతరం
న్యూస్) : టీఎస్ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలపడం హర్షణీయమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమిళసై కార్మికుల పక్షపాతి అని తెలిపారు. భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకూడదనే ఆ బిల్లును పూర్తిగా అధ్యయనం చేశారని… అందులోని లోపాలను ఎత్తి చూపారని అన్నారు. ఇది జీర్ణించుకోలేని కేసీఆర్.. గవర్నర్కు లేనిపోని దురుద్దేశాలు ఆపాదిస్తూ కించపర్చే కుట్రకు తెరలేపారని మండిడ్డారు. ఆర్టీసీ కార్మికుల్లో లేనిపోని అపోహలు సృష్టించారని.. అయినప్పటికీ గవర్నర్ వెరవలేదని ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు.















