EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పేదప్రజలకు వరం వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ, పథకం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిసెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

పేదప్రజలకు వరం వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ, పథకం

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిసెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ సెప్టెంబర్ 2 (ఈతరం భారతం) ఆరోగ్య శ్రీ, పేదల ఇళ్ల పథకం, ఫీ రియింబర్సుమెంట్, రుణ మాఫీ ఇలా ఎన్నో అమల్లోకి తెచ్చిన గొప్ప నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిసెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి గంటలకు గాంధీ భవన్ లో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం మీడియా సమావేశ్గం లో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర గా ఉండిపోతారు. దేశం ఉన్నంత కాలం వైస్సార్ ప్రజల గుండెల్లో ఉంటారన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన ఒక ముఖ్యమంత్రి గా కాకుండా అందరితో సహచరుడిగా ఉండేవారన్నారు.భారీ వర్షాల కారణంగా ఖమ్మం, భద్రాద్రి- కొత్తగూడెం, మహబూబాబాద్ ఇలా పలు జిల్లాలు నీట మునిగాయి.ముఖ్యమంత్రి అనునిత్యం ఆయా జిల్లాల కలెక్టర్లను సంప్రదిస్తూ తెలంగాణ లో పరిస్థితి ని తెలుసు కుంటున్నారు.ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతాలన్నింటిని మానిటర్ చేస్తున్నారు.ఈ కష్టకాలంలో కేంద్రం తక్షణ సహాయం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.. ఎంపీ రాజ్యసభ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, మెట్టు సాయి, నర్సింహారెడ్డి, సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top