EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

త్రిపుర వరద బాధితుల రెడ్ క్రాస్ సహాయం  నిత్యవసర సరుకులు, దుస్తులు, వంట సామాగ్రి తరలింపు  రాజ్ భవన్ యందు జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ

త్రిపుర వరద బాధితుల రెడ్ క్రాస్ సహాయం

 నిత్యవసర సరుకులు, దుస్తులు, వంట సామాగ్రి తరలింపు

 రాజ్ భవన్ యందు జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్ సెప్టెంబర్ 2 (ఈతరం భారతం);: త్రిపుర వరద బాధితుల సహాయార్థం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు జిష్ణు దేవ్ వర్మ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీ లు కలసి 1000 కుటుంబాలకు సరిపడా నిత్యవసర సరుకులు, దుస్తులు, వంట సామాగ్రి, బెడ్ షీట్లు, బ్లాంకెట్స్, దోమతెరలు, కండువాలు, లుంగీలు, శారీలు, షర్ట్లు, రైన్ కోట్లు, బేబీ ఫుడ్, ఫుడ్ ఐటమ్స్, టార్పాలిన్ సీట్లు మొదలగునవి సిద్ధం చేసినట్లు వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీలు తన వంతు సహాయ సహకారాలు అందించినట్లు సాయి చౌదరి వెల్లడించారు. వీటిని త్రిపుర రాష్ట్రానికి తరలించే కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రము రాజ్ భవన్ యందు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ స్వయంగా తన చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారని సాయి చౌదరి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శుక్రవారం నాడు అన్ని జిల్లా సొసైటీలకు తెలిపిన వెంటనే స్పందించి త్రిపుర వరద బాధితులకు తమ వంతు సహాయ సహకారాలను అందించిన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీలను రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అభినందించారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రిన్సిపల్ సెక్రెటరీ టు గవర్నర్ బుర్ర వెంకటేశం, గవర్నర్ గారి సహాయ కార్యదర్శి భవాని శంకర్, రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈ వి శ్రీనివాస్, ప్రసాదరావు, నర్సిరెడ్డి, రవిచంద్ర రెడ్డి, మహేందర్ రెడ్డి, అమర్ ,ఓఎస్ రెడ్డి, జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లు అమరేందర్ రెడ్డి, రాజేశ్వరరావు, భీమిరెడ్డి, వనజా రెడ్డి, కేశవరెడ్డి మరియు డాక్టర్ విజయభాస్కర్ గౌడ్, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top