EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీని వెంటాడుతున్న వాన గండం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

ఏపీని వెంటాడుతున్న వాన గండం

ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ

అమరావతి సెప్టెంబర్ 4 (ఈతరం భారతం); : ఇప్పటికే భారీ వర్షాలతో అతలకుతలమైన విజయవాడ పట్టణం మరో అల్పపీడనం వణికిస్తోంది. నాలుగురోజులుగా నీటిలోనే ఉన్న అనేక కాలనీవాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో వాతావరణశాఖ హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. వాతావరణశాఖ ఆంధ్రప్రదేశ్‌ కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.రుతుపవనాలు చురుకుగా ఉండడం వల్ల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని కారణంగా నాలుగురోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. ఎన్టీఆర్‌, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అల్లూరి అనకాపల్లి, విశాఖ , కాకినాడ, కోనసీమ, గోదావరి, కృష్ణా జిల్లాల్లో రెండు రోజుల పాటు మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది.

 

 

Related News

Select the Topic
Scroll to Top