EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బీసీ వ్యవసాయ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులు          ఈనెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి    సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు

బీసీ వ్యవసాయ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులు

 ఈనెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి

సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు

వనపర్తి, సెప్టెంబర్ 4 (ఈతరం భారతం);కరీంనగర్ జిల్లాలలో ఉన్న బిసీ గురుకుల మహిళా వ్యవసాయ కళాశాలల లో తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వహించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈమేరకు సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు IFS గారు ఒక ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్, వనపర్తి గురుకుల వ్యవసాయ కళాశాలలలో (ఒక్కొక్కటి చొప్పున) అగ్రానమీ (2), లైవ్ స్టాక్ & ఎనిమల్ హస్బెండ్రీ(2), జెనెటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్(2), ఎంటోమోలజీ (2), అగ్రికల్చరల్ ఎకనామిక్స్(2), ప్లాంట్ పాథాలజీ (2), అగ్రికల్చరల్ ఎక్సటెన్షన్ (2) పోస్టులకుగాను దరఖాస్తులు కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇందుకు గాను అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పీహెచ్ డి లేదా యం. ఎస్సీ (అగ్రికల్చర్) చేసి ఉండాలి. లైవ్ స్టాక్ & ఎనిమల్ హస్బండ్రీ పోస్టుకు గాను సంబంధిత విభాగంలో పి హెచ్ డి లేదా యం.వి.ఎస్సీ చేసి ఉండాలి. పీహెచ్ డి, నెట్ అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. పీహెచ్ డి కలిగి ఉండి ఫుల్ టైం పనిచేసే టీచింగ్ అసోసియేట్స్ కి, యం. ఎస్సీ కలిగి ఉండి ఫుల్ టైం పనిచేసే టీచింగ్ అసోసియేట్స్ కి, పార్ట్ టైం టీచింగ్ అసోసియేట్స్ కి తగిన విధంగా గౌరవ వేతనం ఇవ్వబడుతుందని కార్యదర్శి పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్ధులు ఈనెల 13వ తేదీ లోగా తమ పూర్తి వివరాలను (CV/Resume. Academic profile) mjpkrnagbsc2022@gmail.com కి మెయిల్ చేయాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డెమో/ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని, ఇంటర్వ్యూ తేదీలు త్వరలో తెలియజేస్తామని కార్యదర్శి గారు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 76809 41504 ఈ నెంబర్ లో సంప్రదించాలని ఆయన సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top