ఏపీ, తెలంగాణ సీఎంల సహాయనిధికి నారా భువనేశ్వరి రూ. 2 కోట్లు విరాళం
అమరావతి సెప్టెంబర్ 4 (ఈతరం భారతం); : భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాల బాధితులను ఆదుకోవడానికి దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్లిమిటెడ్ నేతృత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. కోటి చొప్పున విరాళాలను ప్రకటించారు. ఈ విరాళాలను ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి పంపనున్నట్లు ఆమె ఎక్స్వేదిక ద్వారా ప్రకటించారు.















