EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

42శాతం రిజర్వేషన్ల సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ  కుల గణన సాధన కోసం ఈనెల 6న రౌండ్ టేబుల్

42శాతం రిజర్వేషన్ల సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ

కుల గణన సాధన కోసం ఈనెల 6న రౌండ్ టేబుల్ సమావేశం

04.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ అమలు కోసం ఎన్ని పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన కుల జనగణన, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడం కొరకు ఈనెల 6న హనంకొండ జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం 1 గంటలకు , ఆల్ పార్టీ, బీసీ కుల, ప్రజా సంఘాల, సామాజిక, ప్రగతిశీల సంఘాల రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడమైనదని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు, పార్టీలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు ఈ రౌండ్ టేబుల్ లో పాల్గొని సూచనలు సలహాలు ఇచ్చి భవిష్యత్తు ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

రౌండ్ టేబుల్ విజయవంతం కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, కుల,ప్రజా సంఘాల నాయకులకు వ్యక్తిగతంగా కలసి ఆహ్వానం అందచేశారు.ఈ కార్యక్రమంలో పటేల్ వనజ, తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్, నాయకులు కొడిపాక దేవిక, సింగారపు అరుణ, మామిడి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top