EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించాలి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ పిలుపు

ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించాలి

పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి

ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ పిలుపు

మేడ్చల్ సెప్టెంబర్ 5 (ఈతరం భారతం);ఆదిలీల ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీవాణి చందేల్ ఆధ్వర్యంలో గురువారం ఘట్కేసర్ లోని ఎన్ ఎఫ్ సి నగర్ లో ఉచితంగా వినాయకుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉచిత గణేషుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మట్టి వినాయకులు వాడి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముల్లి జంగయ్య యాదవ్ ఎన్ఎఫ్సీ నగర్ కౌన్సిలర్ కొమ్మ గాని రమాదేవి మైపాల్ గౌడ్, ఏడవ వార్డు కౌన్సిలర్ సాలూరు నాగజ్యోతి ఎన్ఎఫ్ సి నగర్ వార్డు నెంబర్ 2 అధ్యక్షులు యాదగిరిరావు ఎన్ ఎఫ్ సి నగర్ మహిళా నాయకురాలు మమతా శర్మ ఆదిలీల ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి నల్ల నాగేంద్రరావు భబితారాణి, గజానంద్, బాల్రెడ్డి, సల్ల శివ తదితరులు పాల్గొన్నారు

 

 

Related News

Select the Topic
Scroll to Top