లోయలో పడి నలుగురు ఆర్మీ సిబ్బంది మృతి
సిక్కిం సెప్టెంబర్ 5 (ఈతరం భారతం);సిక్కిం లో రోడ్డు ప్రమాదం సంభవించింది. వాహనం అదుపుతప్పి 700 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ సిబ్బంది పశ్చిమ బెంగాల్లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని పాక్యోంగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి సుమారు 700 నుంచి 800 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారంతా పశ్చిమ బెంగాల్లోని బినాగురికి చెందిన ఎన్రోట్ మిషన్ కమాండ్ విభాగానికి చెందిన వారుగా భారత ఆర్మీ అధికారులు తెలిపారు.















