EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాదు.. రాక్షస  పాలన మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శ

రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాదు.. రాక్షస  పాలన

మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శ

సిద్దిపేట సెప్టెంబర్ 5 (ఈతరం భారతం);: రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాదు , రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. ప్రభుత్వం ముందుగా మేల్కొంటే మరింత ప్రాణనష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఖమ్మం, మహబూబాబాద్‌లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సిద్దిపేట నుంచి ఉడుతా భక్తిగా సహాయం చేస్తున్నామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. తమలాగే బీజేపీ, మిగిలిన పార్టీల నాయకులు సహాయం చేయడానికి మందుకు రావాలన్నారు. తాము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే తమపై దాడి చేసి కేసులు నమోదుచేస్తున్నారని వెల్లడించారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారని వెల్లడించారు. తమకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేకపోయారని చెప్పారు. నీళ్లలో ఇండ్లు మునిగిపోయినవారికి రూ.2 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top