ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న శిరీష శ్రీభాష్యం
ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 5.9.24
హన్మకొండ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని కమలాపూర్ మండలం, ఉప్పల్ గ్రామ జడ్పీ బాలుర హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నశిరీష శ్రీభాష్యం గురువారం అందుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ ప్రావీణ్య, డిఈఓ వాసంతి చేతుల మీదుగా అందుకున్నారు. కవయిత్రి, రచయిత్రి, ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పేరుపొంది జిల్లా స్థాయిలో ప్రభుత్వ అవార్డును అందుకున్న శిరీషను పలువురు ఉపాధ్యాయులు, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు, బంధుమిత్రులు అభినందించారు.















