EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి – సాయి చౌదరి

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి – సాయి చౌదరి

హైదరాబాద్ సెప్టెంబర్ 6 (ఈతరం భారతం); : వర్షాలు తగ్గినప్పటికీ రానున్న మరికొన్ని రోజులు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పాతబడిన ఇండ్లు పడిపోయే ఆస్కారము ఉందని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ చెప్పారు. ఈ సందర్భంగా సాయి చౌదరి మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాల భయం లేనప్పటికీ రానున్న మరో నాలుగు, ఐదు రోజుల వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, సీజనల్ వ్యాధులు అయినటువంటి జ్వరాలు, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. ఎవరికి వారు తమ ఇంటి ముందు ఉన్న మురికి కాలువను శుభ్రం చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవడం, పిచ్చి మొక్కలు తొలగించటం, త్రాగునీటి ట్యాంకుల శుభ్రం చేసుకోవడం, క్లోరినేషన్ వంటి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించి విస్తృతంగా నిర్వహించాలని సాయి చౌదరి కోరారు

Related News

Select the Topic
Scroll to Top