EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

విపత్తుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న జగన్‌    కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు   

విపత్తుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న జగన్‌

 కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు

అమరావతి  (ఈతరం భారతం);: ఏపీలో తలెత్తిన విపత్తుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా తప్పుడు ప్రచారాలు ఆపలేదని దుయ్యబట్టారు.వరదలపై తప్పుడు ప్రచారంతో లబ్దిపొందాలని చూస్తుందని విమర్శించారు. సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినవారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ల సాయంతో చంద్రబాబు బాధితులను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.తన పనితీరు ఏంటో మరోసారి నిరూపించుకున్నారని, ఇంటింటికెళ్లి బాధితులకు బరోసా కల్పిస్తున్నారని వివరించారు. చంద్రబాబుతో ) ప్రధాని మోదీ, అమిత్‌ షా అన్ని వివరాలు తెలుసుకుంటున్నారని వెల్లడించారు. కేంద్రం అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తుందని అన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top