EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రేవంత్ రెడ్డి కీలక వాఖ్యలు !

 రేవంత్ రెడ్డి కీలక వాఖ్యలు !

జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 8.9.24

రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్ట్‌లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలు గా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్ట్‌లు హద్దులు దాటి వ్యవహారించకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు, కొన్ని పత్రికలు చాలా చిల్లర రాతలు రాస్తున్నారని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు హాజరయ్యారు.సమాజంలో జర్నలిస్ట్‌ల సమస్యలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడే గుర్తించారని తెలిపారు. 11 వందల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సంతోషమని చెప్పారు. జర్నలిస్ట్‌ల సమస్యలను పరిష్కరించడంలో కొంతమంది బాధ్యతగా వ్యవహరించలేదని అన్నారు. రాష్ట్ర విభజన లాంటి అంశాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు తమ ప్రభుత్వంలో పరిస్కరిస్తామని హామీ ఇచ్చారు.కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు సెక్రెటరీయేట్‎లో అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాంటి జర్నలిస్ట్‌లకు విలువ లేదని స్పష్టం చేశారు. ఎవరిని చూసిన తాము యూట్యూబ్ అంటున్నారని. కొందరు ఇంకేదో అంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.కొంతమంది జర్నలిస్టులు చీఫ్ మినిస్టర్‌ను చిప్ మినిస్టర్ అంటూ కుర్చీకు ఉన్న గౌరవం పొగొడుతున్నారు. వ్యక్తి నచ్చక పోవచ్చు వ్యవస్థలో గౌరవప్రదమైన పదవికి అయిన విలువ ఇవ్వాలి. ఎదుటి వాళ్లు విలువలు దాటితే మేము దాటుతాం. అక్రిడిడేషన్ విషయంలో ఈసారి కచ్చితంగా నిబంధనలు ఉంటాయి. జర్నలిస్ట్‌లకు పార్లమెంటరి పార్టీ వ్యవస్థలో చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వారు ఎలా ఉన్నారో ఆలోచన చేయాలి. కొన్ని సందర్భాల్లో చిట్‌చాట్‌లను సైతం ఇంకొకలాగా రాస్తున్నారు. గతంలో గాంధీ భవన్‌లో సన్నిహితంగా మాట్లాడిన మాట్లలను రికార్డు చేసిన సందర్భలు ఉన్నాయి. అందుకోసమే జర్నలిస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆరోగ్య శ్రీ కార్డుల విషయంలో ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.సిద్ధాంత పరమైన అంశాల కోసం మాత్రమే అప్పట్లో రాజకీయ పార్టీలు, పత్రికలు పెట్టుకున్నాయని చెప్పారు. దీనికి నిదర్శనం కమ్యూనిస్టులు పార్టీలని తెలిపారు. గతంలో సెక్రెటరీయేట్‎కు ప్రజా ప్రతినిధులు తాము వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. ఈరోజు జర్నలిస్ట్ లు సైతం సచివాలయంలోకి వెళ్లవచ్చని అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top