EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భక్తితోనే జీవితం సఫలం- డా. కేవీరమణాచారి

ఆకర్షణకు లొంగని ఆధ్యాత్మికతే మన సంస్కృతి

 భక్తితోనే జీవితం సఫలం- డా. కేవీరమణాచారి

హైదరాబాద్ సెప్టెంబర్ 9 (ఈతరం భారతం);: భక్తే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుందని భక్తినిప్రతి ఒక్కరూ తమ దినచర్యగా చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డా. కేవీరమణాచారి పిలుపు నిచ్చారు.. శ్రీమానన ఆర్ట్ థియేటర్స్మన స్థాపక కార్యదర్శి రఘుశ్రీ ఆధ్వర్యంలో. బండారుపల్లి రామచంద్రరావు రచించిన -1. ఆత్మీయ రూప, ఆనందప్రద శ్రీశ్రీనివాస శర మంజరి, 2. అస్తరూప, అభయ వరద ఏడు కొండల శ్రీవెంకటేశ్వర శరణు మంజరి-రెండు పుస్తకాల ఆవిష్కరణ సభ కేవీరమణాచారి క్యాంపుకార్యాలయం లో జరిగింది.ఈ కార్యక్రమానికి. ముఖ్యఅతిథిగా డా. కేవీరమణాచారి దంపతులు హజరై పుస్తకాలను ఆధ్యాత్మిక పరిమళాలతో అవిష్కరించారు. గతంలో వెంకటరమణుడిపై 6 పుస్తకాలను బండారుపల్లి రచించగా ఈ రెండు భక్తి గేయాలసంపుటిలతో మొత్తం ఏడు కొండలస్వామికి ఏడుపుస్తకాలతో భక్తనీరాజనం చేసిన్నట్లయింది. ఈ సందర్భంగా డా. కెవీరమణాచారి మాట్లాడుతూ ఆకర్షణకు లొంగని ఆధ్యాత్మికతే మన సంస్కృతి సమాజంలో చోటు చేసుకుంటున్న ఆకర్షణలవల్ల సంస్కృతిని కోల్పోయే ప్రమాదం ఉన్నందున యువత జాగరుకులై సాంప్రదాయ ఆచార్య వ్యవహారాలతో ఆధ్యాత్మిక మార్గంలో నడవడమే ఉత్తమమని తద్వారా భగవంతుని చేరడానికి మార్గం సుగమమవుతుందని అన్నరు. భక్తిని మనసు నించానింపుకున్న రుషిలాంటి కవి బండారుపల్లి అని కొనియాడారు. అరిషడ్వర్గాలు-6, పంచేద్రియాలు-5, పురుషార్ధాలు-4 గుణాలు-8, దైదీ భావన-2 నుంచితనం -1..ఇలా ఈ అరుఅంశాలపై ధర్మం వైపు నిలిచినవారు ధన్యులని డా. కేవీ అన్నారు. ‘న-త-ర’ ల సమ్మేతనం స్త్రీని దైవంగా భావించాలని ఆయన కోరారు. మనసంతా జీవితమంతా భక్తితో నిండి గొప్ప పుస్తకాలను భక్తిసాహిత్యానికి బండారుపల్లి అందించారని డా. కేవీ అభిసందించారప్రముఖ విద్యావేత్త, రచయిత్రి బి.పి.లలికవాణి మాట్లాడుతూ ‘నీకు ఉన్న నామాలు వెయ్యి, మా కున్న కోరికలు ఒక నెయ్యి అని దైవాన్ని నేటి భక్తులు ప్రార్థిస్తున్నారని చమత్కరించారు. ఈపుస్తకంలోని గేయాల విశిష్టతను, పదప్రయోగాన్ని, సాహితీ ప్రయోగాల్ని సవివరంగా విశ్లేషించారు. తిరుమల వైద్యుడని శ్రీనివాసుణ్ణి కవి అనడం సత్యమని, కేవలం స్మర ణంతోనే ఈ దైవం మనల్ని కరుణిస్తాడని అన్నారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ లలితవాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘సర్వభక్తరక్షాదక్షకుడు’ ఆ ఏడుకొండలవాడని ఆమె అన్నారు. నకల తత్వ నిధుడు, అడుగడుకు రండాలవాడని ఆ స్వామని కవి వర్ణించడం ఆనందంగా ఉందని ‘నేటినిజం’ దినపత్రిక సంపాదకులు బైసాదేవదాసు అన్నారు. భర్తకవి వనంతుడు బండారుపల్లి ని ఆయన అభివర్ణించాడు. జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుదిబండి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక వేత్త, అధ్యాపకుడు. గొప్ప దానశీలుడు బండారుపల్లి రామచంద్రరావు అని ప్రశంసించారు. తాను రచించిన ఏడు పుస్తకాలను ఆవిష్కరించిన డాక్టర్ కె.వి రమణాచారి దంపతులను బండారుపల్లి నూతన పట్టు వస్త్రాలు బహుకరించి సాంప్రదాయపద్ధంగా సత్కరించారు. సభా కార్యక్రమానికి ముందు మల్లారం సిస్టర్స్ అంజలి,అక్షర గానం చేసిన శ్రీ అన్నమాచార్య భక్తి కీర్తనలు సబికులను అమితంగా బండారుపల్లి కుటుంబసభ్యులు, సాహితీఅభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పా ల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top