EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

క్షతగాత్రునికి వెస్సో ఆర్దిక సహాయం సహాయం

క్షతగాత్రునికి వెస్సో ఆర్దిక సహాయం సహాయం

గుంటూరు సెప్టెంబర్9 (ఈతరం భారతం);గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నివాసి తాళ్లూరి శ్రీనివాసాచారి (54) ఒక స్థానిక సంస్థలో చిరుద్యోగి. కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకి బలమైన గాయాలు కావడంతో ఆపస్మారక స్థితిలో గుంటూరు లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్య పరీక్షలో మెదడు రెండు చోట్ల వాచినట్లు గుర్తించటం జరిగింది. తక్షణమే సర్జరీ అవసరమని, సుమారుగా 5 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. కొన్ని సాంకేతిక కారణాల కారణంగా వీరికి ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పధకం వర్తించ లేదు. ఉన్న చిన్న ఇంటిని కూతురు పెండ్లి ఖర్చుల కోసం కుదువ పెట్టారు. బంధుమిత్రుల ఆర్ధిక సహాయంతో ఇప్పటికి సుమారు లక్ష రూపాయల వరకూ ఆసుపత్రి బిల్లులు చెల్లించారు. శ్రీనివాసా చారి కుమార్తె సంధ్య తన తండ్రి సర్జరీ కొరకు ఆర్ధిక సహాయం చేయమని వెస్సోని ఆశ్రయించారు. వెస్సో గౌరవ దాతల సహకారంతో, పిడుగురాళ్ల సామాజిక సేవకులు రాగి నరసింహ చారి చేతుల మీదుగా 54800/-ల రూపాయల చెక్కును తాళ్లూరి శ్రీనివాసాచారికుటుంబ సభ్యులకు అందచేసింది. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూపూర్తి ఆపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసా చారి వైద్యం కొరకు ఆర్ధిక సహాయం చేసి ఆదుకొన్న గౌరవ దాతలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top