శ్రీ రామకృష్ణ సేవా సమితి ధ్యాన మందిరంలో మట్టి గణపతి విగ్రహ ప్రతిష్ట
హనుమకొండ సెప్టెంబర్9(ఈతరం భారతం ); హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీ శ్రీ రామకృష్ణ సేవా సమితి నూతన భవనంలో శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి కమిటీ సభ్యులు, వాలంటీర్ల పర్యవేక్షణలో విఘ్నేశ్వరుడి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగినవి. మట్టి గణేశ విగ్రహ దాత రూపి రెడ్డి రాధిక గోపాల్ రెడ్డి దంపతులు తొలిరోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను విఘ్నేశ్వరుడికే చేస్తారు. పార్వతీ తనయుడి కృపాకటాక్షాలుంటే అన్ని కార్యాలు జయమవుతాయని, భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, జనం ఆరాధించే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడని, ఈ పండుగను కుల-మతాలకు అతీతంగా జరుపుకోవడం విశేషమని, పురోహితులు శ్రీ లక్ష్మీనరసింహ శర్మ మట్టి గణపతి విగ్రహ ప్రతిష్టానంతరం తెలియజేశారు.సేవా సమితి భవన నిర్మాణం కోసం శ్రీ ఎం. నవీన్ రెడ్డి సరస్వతి దంపతుల పుత్రిక పదివేల రూపాయలు విరాళమివ్వడం అభినందనీయం. మరియు వినాయక వేడుకల నిర్వహణ నిమిత్తం, భక్తులు నిర్మల-నరసయ్య 1,005/-, కాసర్ల సరోజన 1116/-, తాటిపర్తి జనార్దన్ రావు 521/-, లక్ష్మీ 516/- రూపాయల చెల్లించి విజ్ఞేశ్వరుడి ఆశీస్సులు పొందడం విశేషం. ఈ పూజా కార్యక్రమంలో సమితి సభ్యులు… కక్కెర్ల శ్రీనివాస స్వామి, కెవి రావు, మూల తిరుపతిరెడ్డి, కోడెల సూర్య, బోయినపల్లి పార్వతి, లక్ష్మీ రావు, వీణ, యోగా గురూజీ రవీంద్ర చారి, యోగసాధకుల బృందం మరియు శ్రీ రామకృష్ణ సేవా సమితి భక్తులు పాల్గొన్నారు.















