EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో

ఘనంగా టీచర్స్ డే వేడుకలు

హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ఈతరం భారతం  );ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి గారి అధ్యక్షతన రావ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడ లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో గురువులు చేసిన సేవలను గౌరవిస్తూ గురువులకు విద్యా ప్రదాత గురుసేవ పురస్కారాలు ప్రధానం చేయడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిలు గా రాష్ట్ర రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి డా. శ్రీరాములు, ఫెలీనా మిస్సెస్ ఇండియా విన్నర్ డాక్టర్ సూర్య రేవతి మెతుకూరు, ప్రఖ్యాత న్యూమరాలజిస్ట్ దైవజ్ఞశర్మ, రెడ్ క్రాస్ వరంగల్ స్టేట్ ఎంసీ సభ్యులు ఈవి శ్రీనివాస్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుండి అంచెలంచెలుగా ఎదిగి భారత దేశ రెండవ రాష్ట్రపతిగా సేవలందిన తీరు మనందరికీ ఆదర్శమని, శూన్యాన్ని తొలగించి జ్ఞానమును ప్రసాదించే దేవదూత అని, రాయిలాంటి మనుషులను అందమైన శిల్పాలుగా చెక్కే శిల్పి గురువు అని అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో గురువుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని తెలిపారు. రెడ్ క్రాస్ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా గురువులందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. లోకం తెలియని పసివాడైన, లోకాలేలే పైవాడైనా, ఆది గురువు నీ తల్లిని మొదలు, జ్ఞానం పంచే ప్రతి ఒక్కరిలో కొలువుండేది గురువే కదా, కనిపించే గురువే దైవం కదా..!!! అని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులను గౌరవించాలని తెలిపారు. మేము రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతిసారి ఉపాధ్యాయుల సేవలను కొనడుతూ వారికి అవార్డులను ప్రధానం చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో కూడా గురువులను గౌరవిస్తూ టీచర్స్ డే వేడుకలు జరుపుతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా అసఫ్ జాహి వంశస్థులు 9వ నవాబ్ రౌనహ్ యార్ ఖాన్, రాష్ట్ర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కమిటీ సభ్యులు డా. బి విజయ్ భాస్కర్ గౌడ్, హైదరాబాద్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కృష్ణ యాదవ్, మార్క్ ఇన్ఫ్రా బిల్డర్ అండ్ డెవలపర్ ఎండి మాజీద్, మరియు రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏవి రావు, వీరమని, సందేశ్, వినయ్ కిషోర్, జ్యోతి, అభిషేక్, మాజీ ఎంసీఏ సభ్యులు మహమ్మద్ రియాజుద్దీన్, హైదరాబాద్ డివిజనల్ కన్వీనర్ ధర్మతేజ, సికింద్రాబాద్ డివిజనల్ కన్వీనర్ ఆయుబ్ ఖాన్, అవార్డు గ్రహీతలు, రెడ్ క్రాస్ వాలంటీర్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Related News

Select the Topic
Scroll to Top