పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను మార్యదపూర్వకంగా కలిసిన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షులు రంగయ్య : శాలువాతో సత్కారం :హైడ్రా ఏర్పాటు చేయడం పై అభినందన
హైదరాబాద్ సెప్టెంబర్10 (ఈతరం భారతం): నూతన తెలంగాణ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ను మంగళవారం హైదర్ గూడ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షులు రంగయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. పర్యావరణం బలోపేతానికి ప్రభుత్వం “హైడ్రా ” వ్యవస్థ ను తీసుకు రావడం అభినందనీయమని, హైడ్రా కు మరిన్ని అధికారాలతో పర్యావరణాన్ని మరింత బలంగా కాపాడాలని ఈ సందర్బంగా రంగయ్య పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామన్ గౌడ్ పాల్గొన్నారు.















