తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
ఏలూరు సెప్టెంబర్ 11 (ఈతరం భారతం);తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం చిలకవారిపాకల సమీపంలో అదుపుతప్పి మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు.ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీ వ్యాన్ మంగళవారం బయల్దేరింది. దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యాన్ బోల్తాపడింది.మినీ వ్యాన్ బోల్తా పడటంతో జీడిపిక్కల కింద ఇరుక్కుని ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాగా, ఈ ఘటనలో డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు.















