రెజ్లర్ వినేశ్ ఫోగట్ నామినేషన్ దాఖలు
హైదరాబాద్:సెప్టెంబర్ 11 ఈతరం భారతం ప్రతినిధి
హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన రెజ్లర్ వినేశ్ ఫోగట్, ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తోంది. నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో వినేశ్‌కు వ్యతిరేకంగా.. బీజేపీ తరపు నుంచి కెప్టెన్ యోగేశ్ బైరాగీ పోటీప డనున్నారు. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడను న్నాయి















