చెస్ చాంప్ సంహిత కు సన్మానం
హైదరాబాద్ సెప్టెంబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );ఇటీవల2024 ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 5 వరకు శ్రీలంకలోని వాస్కడువాలో కామన్వెల్త్ చెస్ టోర్నమెంట్ 2024లో సంహిత 3 పతకాలు గెలుచుకుందికామన్వెల్త్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్‌లో స్వర్ణం, ర్యాపిడ్‌లో కాంస్యం మరియు క్లాసికల్ ఫార్మాట్లలో కాంస్యం గెలుచుకుంది. ఆమె కింగ్స్ చెస్ అకాడమీతో అనుబంధం ఉన్న సాకేత్ పెదగంధం & దీప్తమ్ష్ రెడ్డిల వద్ద శిక్షణ పొందుతోంది. ఈరోజుతెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయం ఎల్బీ స్టేడియంలో చైర్మన్శివసేనారెడ్డి, విసి & ఎండి శ్రీమతి ఏ.. సోని బాలాదేవి సత్కారం చేశారు
ఈ ఏడాది ఆమె సాధించిన విజయాలు:
స్వర్ణం – బాలికల U10 విభాగంలో చెస్ సాల్వింగ్ ఛాంపియన్షిప్ ప్రపంచ కప్ – బటుమి 2024
రజతం – 26వ ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్ U 10 బాలికల (జట్టు), అల్మటీ – 2024
కాంస్యం – కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్ 2024 (U10 బాలికలు), మలేషియా.
స్వర్ణం – 36వ జాతీయ అండర్ 09 బాలికల చెస్ ఛాంపియన్షిప్ 2 నుండి 8 నవంబర్ 2023 వరకు జంషెడ్పూర్, జార్ఖండ్.
ఉమెన్ గ్రాండ్ మాస్టర్ కావాలన్న తన ఆకాంక్షకు సహకారం అందజేస్తామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డితెలిపారు















