తెలంగాణాలో వరద బాధితుల సహాయార్థం పవన్ కళ్యాణ్ రూ. కోటి విరాళం
హైదరాబాద్ సెప్టెంబర్ 11 (ఈతరం భారతం);: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ. కోటి విరాళాన్ని ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆ సహాయార్ధానికి సంబంధించిన చెక్కును నేడు సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో పవన్ భేటీ కావడం ఇదే తొలిసారి.















