EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వాహనాల తనిఖీ లో సారాయి లభ్యం

వాహనాల తనిఖీ లో సారాయి లభ్యం

11.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఇల్లందు రోడ్డు, రైల్వే స్టేషన్, కురవి గేటు, సలార్ తండా ఏరియాలలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ వరంగల్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మహబూబాబాద్ సిబ్బంది సంయుక్తంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇట్టి తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నుండి నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి సారాయి తయారీకి కావలసిన నల్లబెల్లం మరియు పటిక తన కారుతో రవాణా చేస్తున్న ఆలేరు గ్రామానికి చెందిన గుగులోతు సైదులు ను, రైలు ద్వారా బెల్లం తీసుకువచ్చి కురవి మండలంలోని ఇస్లావత్ తండాకు బైక్ ద్వారా రవాణా చేస్తున్న ఇస్లావత్ నవీన్ లను అదుపు లోకి తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది.గుగులోతు సైదులు, ఇస్లావత్ నవీన్ ల నుండి 450కిలోల బెల్లం, 150కేజీల పటిక, 41 లీటర్ల సారాయి, ఒక స్విప్ట్ డిజైర్ కారు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకొని సీజ్ చేసారు.

Related News

Select the Topic
Scroll to Top